Header Banner

తెలంగాణ ముద్దుబిడ్డ శివశంకర్ జయంతి.. తెలంగాణ ప్రవాసీ దివస్’గా జరపాలని డిమాండ్! టీపీసీసీ ఎన్నారై సెల్ విజ్ఞప్తి!

  Thu Feb 27, 2025 20:39        Others

పి. శివ శంకర్ జన్మదినం 10 ఆగస్టున 
'తెలంగాణ ప్రవాసీ దివస్' నిర్వహించాలి విదేశీ వ్యవహారాల మంత్రిగా సేవలందించిన తెలంగాణ ముద్దుబిడ్డ పి. శివ శంకర్ జన్మదినం ఆగస్టు 10 నాడు ప్రతి ఏటా 'తెలంగాణ ప్రవాసీ దివస్' ను నిర్వహించాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా లేఖ రాశారు. వివిధ దేశాలలో ఉన్న ఎన్నారై లను మాతృభూమి తెలంగాణకు అనుసంధానం చేయడం, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి సత్కరించడం, పెట్టుబడుల ప్రోత్సాహం గురించి ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.  రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో...  పి. శివశంకర్ 1986 లో 12 మే నుంచి 22 అక్టోబర్ వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా శివశంకర్ గారి వద్ద ఉండడంతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


గల్ఫ్ ఉపాధి, ఉద్యోగాల నియామకాల్లో మోసాలను అరికట్టడానికి గాను న్యాయశాస్త్రంలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎమిగ్రేషన్ చట్టానికి సవరణలు చేయించారు. గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవము, సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, స్వయం ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అంతకు ముందు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో పనిచేశారు. 1974 నాటికి చిన్న వయసులోనే శ్రీ పి. శివశంకర్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగారు. ఎమర్జెన్సీ మరియు ఎమర్జెన్సీ అనంతరం శ్రీమతి ఇందిరా గాంధీ గారికి ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు. న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, న్యాయశాఖ మంత్రిగా, న్యాయ శాస్త్రంలో, ఇంగ్లీష్ భాషలో మంచి పట్టుతో పేరుగాంచారు. ఇంధన, వాణిజ్య, విదేశీ వ్యవహారాల, మానవ వనరుల శాఖల మంత్రిగా, గవర్నర్ గా, జాతీయ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 10 ఆగస్టు 1929 న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లి లో ఒక పేద మున్నూరుకాపు కుటుంబంలో జన్మించిన పి. శివ శంకర్ గారు 27 ఫిబ్రవరి 2017 న మృతి చెందారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #telngana #sivasankar #todaynews #flashnews #latestnews